Home > TELANGANA > TS బదులు TG – నేటి కేబినెట్ లో కీలక నిర్ణయం

TS బదులు TG – నేటి కేబినెట్ లో కీలక నిర్ణయం

BIKKI NEWS (FEB. 04) : వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్‌లో తెలంగాణ రాష్ట్ర కోడ్‌ను తెలిపే TS కు బదులుగా TG’ని ప్రవేశపెట్టాలని (TG instead of TS) రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్సమాచారం. ఉద్యమకాలంలో తెలంగాణను సంక్షిప్త రూపంలో TG గా పరిగణించేవారని.. ఈ క్రమంలోనే కోడ్‌ను ‘టీజీ’గా మార్చేందుకు సిద్ధమైందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్‌ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.